కరోనాకి తీసిపోని ఎల్లో వైరస్, శవ రాజకీయం చేస్తున్నారు, కొడాలి నానీ ఫైర్

Tuesday, March 31, 2020 01:37 PM Politics
 కరోనాకి తీసిపోని ఎల్లో వైరస్, శవ రాజకీయం చేస్తున్నారు, కొడాలి నానీ ఫైర్

ఏపీలో కరోనా వైరస్ తీవ్రస్థాయిలో ప్రబలుతున్నా అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం మాత్రం ఆగేలా లేదు. చోడవరంలో వృద్ధురాలి మృతిపై చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని విమర్శించారు. కరోనా వైరస్‌కు భయపడి చంద్రబాబు హైద్రాబాదులో ఇంట్లో దాక్కున్నారని ఆయన మండిపడ్డారు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలు చేయడం తగదని హితవు పలికారు. తప్పుడు రాతలు రాయటానికి ఇది సందర్భం కాదని కొడాలి నానీ విమర్శించారు.

70 ఏళ్ళ వయసు వచ్చినా చంద్రబాబుకు సిగ్గు శరం లేదని, బుద్ధి జ్ఞానం లేదని శవ రాజకీయాలు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. ప్రభుత్వానికి సూచనలు ఇచ్చే విధంగా ప్రతిపక్షం ఉండాలని అన్నారు. ఇక చంద్రబాబుకు అనుకూలంగా తప్పుడు వార్తలు రాస్తున్నా ఎల్లో వైరస్ కోరలు పీకే మందు తమ దగ్గర ఉందన్నారు. రేషన్‌ డీలర్ దగ్గర ఎండలో నిలబడి వృద్ధురాలు చనిపోయిందంటూ జగన్‌ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఇక దానికి బాధ్యులుగా మేము రాజీనామా చెయ్యాలని రాజకీయం చెయ్యటం దారుణం అని పేర్కొన్నారు. రాష్ట్రం ఏమైనా ఫర్వాలేదని చంద్రబాబు హైదరాబాద్‌ వెళ్లిపోయారని విమర్శించారు.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: