కృష్ణా జలాల వినియోగంలో రికార్డు నెలకొల్పిన తెలుగు రాష్ట్రాలు.

Wednesday, May 20, 2020 12:37 PM Politics
కృష్ణా జలాల వినియోగంలో రికార్డు నెలకొల్పిన తెలుగు రాష్ట్రాలు.

కృష్ణా నదీ జలాల వినియోగంలో తెలుగు రాష్ట్రాలు సరికొత్త రికార్డు సృష్టించాయి. ప్రస్తుత నీటి సంవత్సరంలో(జులై 1 నుంచి మే 31 దాకా) రెండు రాష్ట్రాలు కలిపి 920.405 టీఎంసీలు వినియోగించుకున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ 647.559 టీఎంసీలు వినియోగించుకుంటే.. తెలంగాణ 272.846 టీఎంసీలు ఉపయోగించుకుంది. ఆంధ్రప్రదేశ్‌ వాటా వినియోగం పూర్తి కాగా.. తెలంగాణ వాటాలో ఇంకా 60.605 టీఎంసీల మిగులు ఉంది.

  • నీటి సంవత్సరం జూన్‌ 1న ప్రారంభమై.. మే 31న ముగుస్తుంది. ఈ నీటి సంవత్సరంలో శ్రీశైలం జలాశయానికి భారీగా 1,782 టీఎంసీల ప్రవాహం వచ్చింది. 
  • నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్ట్‌లు నిండాయి. కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేస్తూనే ప్రకాశం బ్యారేజీలో మిగులుగా ఉన్న 801 టీఎంసీలను సముద్రంలోకి విడుదల చేశారు.
  • శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా 169.668 టీఎంసీలు, హంద్రీ–నీవా ద్వారా 41.918, ముచ్చుమర్రి ఎత్తిపోతల ద్వారా 5.410, చెన్నైకి తాగునీటి సరఫరా రూపంలో 3.333 వెరసి ఆంధ్రప్రదేశ్‌ 220.329 టీఎంసీలు వినియోగించుకుంది. 
  • శ్రీశైలం జలాశయం నుంచి కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 49.677 టీఎంసీలు, చెన్నైకి తాగునీటి సరఫరా రూపంలో 1.667 వెరసి 51.344 టీఎంసీలు తెలంగాణ వినియోగించుకుంది.
  • సాగర్‌ ప్రాజెక్ట్‌ నుంచి ఎడమ కాలువ ద్వారా 35.287 టీఎంసీలు, కుడి కాలువ ద్వారా 158.264 టీఎంసీలు, కృష్ణా డెల్టాకు 152.360, గుంటూరు చానల్‌కు 3.150 వెరసి 349.061 టీఎంసీలను ఆంధ్రప్రదేశ్‌ వినియోగించుకుంది. 
  • సాగర్‌ నుంచి హైదరాబాద్‌ తాగునీటి సరఫరా, ఏఎమ్మార్పీ ద్వారా 57.799, ఎడమ కాలువ ద్వారా 91.007 వెరసి 148.806 టీఎంసీలను తెలంగాణ ఉపయోగించుకుంది.
  • తుంగభద్ర ప్రాజెక్ట్‌ నుంచి హెచ్చెల్సీ ద్వారా 30.192, ఎల్లెల్సీ ద్వారా 20.215, కేసీ కెనాల్‌ ద్వారా 27.762 వెరసి 78.169 టీఎంసీలను ఆంధ్రప్రదేశ్‌ వినియోగించుకుంది. 
  • ఆర్డీఎస్‌ ద్వారా తుంగభద్ర ప్రాజెక్ట్‌ నుంచి 5.93 టీఎంసీలు తెలంగాణ వాడుకుంది. 
  • జూరాల ప్రాజెక్ట్‌ నుంచి 27.589, నెట్టెంపాడు ఎత్తిపోతల ద్వారా 12.223, భీమా ఎత్తిపోతల ద్వారా 13.049, కోయిల్‌సాగర్‌ ఎత్తిపోతల ద్వారా 4.422 వెరసి 57.283 టీఎంసీలను తెలంగాణ వినియోగించుకుంది.
  • మూసీ, పాకాల చెరువు, వైరా తదితర మధ్యతరహా ప్రాజెక్ట్‌ల ద్వారా 9.483 టీఎంసీలను తెలంగాణ వినియోగించుకుంది.
  • ప్రస్తుత నీటి సంవత్సరంలో తెలుగు రాష్ట్రాల్లోని కృష్ణా పరీవాహక ప్రాంత రిజర్వాయర్లలో 980.738 టీఎంసీల లభ్యత ఉన్నట్లు బోర్డు లెక్కగట్టింది.
  • ఇందులో ఆంధ్రప్రదేశ్‌ వాటా (66 శాతం) 647.287 టీఎంసీలు కాగా.. తెలంగాణ వాటా (34 శాతం) 333.451 టీఎంసీలు. 

For All Tech Queries Please Click Here..!
Topics: