చంద్రబాబుకు షాక్, బీజేపీకి బూస్ట్ - పవన్ కళ్యాణ్ మైండ్ గేమ్?
Wednesday, January 12, 2022 10:38 AM Politics
ఏపీలో రాజకీయాలు ఎప్పుడెలా మారతాయో తెలియని పరిస్ధితులు నెలకొంటున్నాయి. ఒకప్పుడు టీడీపీతో పొత్తు కుదుర్చుకుని పోటీ చేయకుండా మద్దతుకే పరిమితమైన జనసేన ఆ తర్వాత విడిగా పోటీ చేసినా టీడీపీ మిత్రపక్షంగానే విమర్శలు ఎదుర్కొని రాజకీయంగా గత సార్వత్రిక ఎన్నికల్లో నష్టపోయింది.
అనంతరం బీజేపీతో పొత్తు కుదుర్చుకుని అప్పుడప్పుడూ వారితో కలిసి పోరాటాలు చేస్తున్న పవన్ తాజాగా టీడీపీతో మళ్లీ జత కడతారంటూ ఊహాగానాలు వస్తున్నాయి. దీనిపై స్పందించే క్రమంలో ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలుచంద్రబాబుకు భారీ షాకివ్వగా బీజేపీని సంతోషంలో నింపాయి. ఇప్పుడు టీడీపీతో పొత్తు కుదుర్చుకుంటారంటూ సర్వత్రా ప్రచారం జరుగుతున్న వేళ మళ్లీ భారీ ట్విస్ట్ ఇచ్చి బీజేపీతో పొత్తులో ఉన్నానంటూ క్లారిటీ ఇచ్చేశారు. అంతటితో ఆగకుండా ఇతర పార్టీల మైండ్ గేమ్ లో పడొద్దంటూ తన కార్యకర్తలకు హితవు పలికారు.
For All Tech Queries Please Click Here..!