ఈ పరిస్థితి వస్తుందని చెప్పినా చంద్రబాబు వినలేదు

Friday, January 24, 2020 07:33 AM Politics
ఈ పరిస్థితి వస్తుందని చెప్పినా చంద్రబాబు వినలేదు

చంద్రబాబు, లోకేశ్‌ తీరు వల్లే శాసన మండలి ఉనికే లేకుండాపోయే పరిస్థితి ఏర్పడిందని పీడీఎఫ్‌ సభ్యులు, పలువురు ఇండిపెండెంట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సలహాలు, సూచనల వరకే పరిమితం కావాలని తాము మొదటి నుంచి టీడీపీ సభ్యులకు చెబుతున్నా స్వప్రయోజనాలు చూసుకున్నారని, వారి స్వార్థానికి అందరూ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని మండిపడుతున్నారు.  టీడీపీ తీరుపై పీడీఎఫ్‌ ఫ్లోర్‌ లీడర్‌ విఠపు బాలసుబ్రహ్మణ్యం మండలిలో అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. బిల్లులు అడ్డుకోవడం సరికాదని స్పష్టం చేశారు. ఆ తర్వాత చైర్మన్‌తో జరిగిన చర్చల్లోనూ.. నిబంధనల ప్రకారం వ్యవహరించి బిల్లులపై ఓటింగ్‌ నిర్వహించాలని కోరారు.

చైర్మన్‌తో చంద్రబాబు తప్పు చేయించి అందరినీ బలి చేస్తున్నారని పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలికి ఎలాంటి అధికారాలు, విధులు లేవని.. అనవసరంగా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టి ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దని స్వతంత్య్ర సభ్యుడు కంతేటి సత్యనారాయణరాజు  టీడీపీకి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. చాన్నాళ్ల అనంతరం వైఎస్‌ హయాంలో మండలిని పునరుద్ధరించుకుంటే.. ఇప్పుడు దాన్ని లేకుండా చేయొద్దని హితవు పలికినా చంద్రబాబు అండ్‌ కో పట్టించుకోలేదు. చంద్రబాబు రాజకీయం వల్ల సొంత పారీ్టకి చెందిన సభ్యులతోపాటు పట్టభద్రులు, ఉపాధ్యాయుల ప్రతినిధులుగా మండలిలో అడుగుపెట్టిన మేధావులకు సైతం నష్టం జరిగే పరిస్థితి ఏర్పడిందని సభ్యులు ఆవేదన వెలిబుచ్చుతున్నారు.

For All Tech Queries Please Click Here..!
Topics: