సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవాడికే 400 కోట్లు ఇచ్చారు అంటే ఎంత దోచుకుని ఉంటారు?

Friday, January 17, 2020 01:11 PM Politics
సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవాడికే 400 కోట్లు ఇచ్చారు అంటే ఎంత దోచుకుని ఉంటారు?

సతీష్ చాగంటి సోషల్ మీడియాలో వుండే అందరికీ ఈ పేరు సుపరిచితమే. చంద్రబాబు వంటిమీద ఈగ వాలనివ్వడు. పచ్చ మీడియా చిమ్మే విషంలో ప్రధాన పాత్ర ఇతనిదే. బ్రింగ్ బాబు బ్యాక్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేసి. అదే సమయంలో వైయస్ కుటుంబంపై విషం చిమ్మినందుకు చంద్రబాబు ఇతనికి భారీగానే దోచిపెట్టాడు. కుంభకోణం జరిగిన తీరుతెన్నులు జాగ్రత్తగా చూడండి.

అమరావతి మెరీనా పేరుతో చంద్రబాబు ప్రభుత్వం ఒక భారీ ప్రాజెక్ట్ ప్లాన్ చేసింది . మెరినాలో 100 బోట్లకి సౌకర్యం ఉండేటట్లు, వాటి రిపేర్లకు, కృష్ణానదిలో షికార్లు, నీళ్ళల్లో జలక్రీడలు, టూరిజం లాంటివన్నీ ఈ ప్రాజెక్ట్ కిందకి వచ్చే విధంగా ప్లాన్ చేసారు. దానికోసం తుళ్లూరు మండలంలో సర్వే నెంబర్లు 59,60,62,63,64 అలానే నదికి మరో వైపు సర్వే నెంబర్లు 48,49,59 లలో ఉన్న మొత్తం 7 ఎకరాల 38 సెంట్లు భూమిని ఈ ప్రాజెక్ట్ కోసం కేటాయించారు. ఈ ప్రాజెక్ట్ కోసం ఇదే రంగంలో అనుభవజ్ఞులైన కంపెనీలు టెండర్లలో పాల్గోవాలని 2018 జూన్ 2 వ తారీఖున టెండర్లు పిలిచారు . టెండర్లలో మెరినా / బీచ్ లు నిర్వహించటంలో అనుభవం . టూరిజంలో అనుభవం . జలక్రీడలు మరియు బోట్లు , విహార యాత్రలు నిర్వహించే అనుభవం లాంటి నిబంధనలు పెట్టారు .

ఈ ప్రాజెక్ట్ ని ఎవ్వరికి కట్టబెట్టాలో ముందుగానే నిర్ణయించిన చంద్రబాబు. సతీష్ చాగంటితో 2018 మే 29 న అమరావతి కోస్తా ఈ-మెరీనా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని పెట్టించాడు. టెండర్లు పిలిచే సరిగ్గా మూడంటే మూడే రోజులు ముందు సతీష్ చాగంటితో ఈ కంపెనీని పెట్టించారు . పైన పేర్కొన్న నిబంధనలు ఏవీ అనుసరించలేదు. టెండర్లలో ఎన్ని కంపెనీలు వచ్చాయో అసలు ఎవరెవరు వచ్చారో ఆదేవుడికే తెలియాలి. మొత్తానికి అదే నెలలో ఈ ప్రాజెక్ట్ ని సతీష్ చాగంటి కంపెనీకి కట్టబెట్టారు.

మొత్తం 8 ఎకరాలని నామమాత్రపు ధరకి అనగా ఎకరం లక్ష రూపాయలకే సతీష్ కి ఇచ్చేసారు . దీనిని ప్రైవేట్ పబ్లిక్ భాగస్వామ్యంతో నిర్మిస్తున్నట్లు పేర్కొని 33 ఏళ్ళకి సతీష్ కంపెనీకే తిరిగి నిర్వహణా బాధ్యతలు అప్పగించారు. చంద్రబాబు రెండు రోజుల క్రితం చెప్పిన దానిని బట్టి గజం లక్ష రూపాయల చొప్పున వేసుకొంటే సతీష్ చాగంటికి దోచిపెట్టిన భూమి విలువ దాదాపుగా 400 కోట్లు .

సవంత్సరానికి 100 కోట్లు ఆదాయం వచ్చే విధంగా మొత్తం 33 సంవత్సరాలకి కట్టబెట్టారు . అంటే రాబోయే 33 ఏళ్లలో ప్రభుత్వ వాటా పోను మిగిలిన ఒక్క సతీష్ చాగంటికే 1700 కోట్లు లబ్ది చేకూరే విధంగా పకడ్భందిగా స్కెచ్ వేశారు . ఇందులో చినబాబు వాటా ఎంతో పెదబాబు వాటా ఎంతో పైనున్న దేవుడికే తెలియాలి .

ఈ కుంభకోనం కోసం సతీష్ చాగంటి మొత్తం 4 కంపెనీలు పెట్టాడు .అమరావతి కోస్తా ఈ-మెరీనా ప్రైవేట్ లిమిటెడ్ , కోస్తా మెరీనా అండ్ క్లబ్ ప్రైవేట్ లిమిటెడ్ ,కోస్తా ప్లాంటేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ,కోస్తా అగ్రి ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలని పెట్టారు . ఈ నాలుగు కంపెనీలలో ఉమ్మడిగా ఉన్నది కానుమిల్లి వెంకట సూర్యప్రకాశరావు అనే అతను . సతీష్ చాగంటి డైరెక్టర్ గా ఉన్న మొదటి రెండు మెరీనా కంపెనీలకి ఈ కాంట్రాక్టు ఇచ్చారు. ఈ కంపెనీలన్నీ ఒకే అడ్రస్ కింద రిజిస్టర్ చేసారు . 33-21-33 , సీతారామపురం , ఏలూరు రోడ్ , విజయవాడ , కృష్ణ జిల్లా , ఏపీ . ఇదే అడ్రెస్ మీద కంపెనీలు రిజిస్టర్ చేసారు.

ఇంకో అసలైన ట్విస్ట్ ఏమిటంటే ఇదే అడ్రస్ తో ( డోర్ నెంబర్ తో సహా ) మొత్తం 491 కంపెనీలు రిజిస్టర్ చేసారు . ఇవి మొత్తము డమ్మీ సూట్కేసు కంపెనీలు . దాదాపుగా కంపెనీలు అన్నీ ( 90 శాతం పైగా ) 2015 నుండి 2019 మార్చి మధ్యలోనే స్థాపించారు.

For All Tech Queries Please Click Here..!
Topics: