ఏపీ మూడు రాజధానుల వ్యవహారం మరోసారి తెరమీదకు. హైకోర్టుకు చేరిన ఫైల్, జగన్ ప్రభుత్వం కి జలక్.
ఏపీ మూడు రాజధానుల వ్యవహారం మరోసారి తెరమీదకు వచ్చింది. జనవరిలో జరిగిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో బిల్ పాస్ అవగా, శాసనమండలిలో అడ్డుకున్న టీడీపీ రాజధాని బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపిస్తూ మండలి ఛైర్మెన్ ఆదేశించారు. తనకున్న విచక్షణాధికారాల మేరకు నిర్ణయం తీసుకున్నట్లు మండలి ఛైర్మెన్ ప్రకటించారు.
అప్పట్లో దీనిపైన రాజకీయంగా పెద్ద దుమారమే చెలరేగింది. ఛైర్మెన్ పైన వైసీపీ నేతలు మండిపడ్డారు. ఏకంగా మండలినే రద్దు చేస్తూ ఏపీ శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. దీంతో మూడు రాజధానుల వ్యవహారం పెండింగ్‌లో పడింది.
ఇప్పుడు ఈ వ్యవహారం హైకోర్టుకు చేరింది. మండలి ఛైర్మెన్ ఆదేశాలు అమలుకాలేదంటూ టీడీపీ ఎమ్మెల్సీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. గతంలో రాజధాని మార్పు, కార్యాలయ మార్పు విషయంలో తమకు సమాచారం ఇవ్వకుండా ఎటువంటి నిర్ణయాలు వెల్లడించరాదని స్పష్టం చేసిన హైకోర్టు ఇప్పుడు ఎటువంటి తీరు ఇవ్వనుందో చూడాలి.