సోషల్ మీడియా పోస్టులపైన విజయసాయిరెడ్డి హెచ్చరిక.

Sunday, May 10, 2020 01:15 PM Politics
సోషల్ మీడియా పోస్టులపైన విజయసాయిరెడ్డి హెచ్చరిక.

నా వ్యక్తిగత ప్రతిష్ట, గౌరవ, మర్యాదలకు భంగం కలిగించేలా నా పేరుతో కొందరు సోషల్ మీడియాలో ఫేక్‌ అకౌంట్లు సృష్టించి అసభ్య పదజాలంతో సాగిస్తున్న దుష్ప్రచారంపై ఆధారాలతో సహా ఏపీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ మొదలెట్టారు. ఈ ఫేక్‌ గ్యాంగ్‌ మొత్తాన్ని బుక్ చేసి అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం అవుతోంది. సైబర్‌ క్రైమ్‌ చట్టం కింద వారిపై కఠిన చర్యలు తప్పవు. 

ఫేక్‌ గ్యాంగ్‌ పోస్టులను అత్యుత్సాహంతో షేర్ చేసుకునే వాళ్ళు సైతం సైబర్ క్రైమ్ చట్టం కింద శిక్షార్హులే. అలాంటి వారు ప్రపంచంలో ఎక్కడున్నా...ఏ రాష్ట్రం, ఏ దేశంలో ఉన్నా సైబర్ క్రైమ్ పోలీసుల వలకు చిక్కక తప్పదు. కేసులు, అరెస్ట్‌లు ఎదుర్కోకుండా తప్పించుకోలేరు. 

కాబట్టి నా వ్యక్తిగత ప్రతిష్టకి భంగం కలిగించే విధంగా అసత్య ఆరోపణలు, ప్రచారాలు చేస్తూ సోషల్ మీడియాలో అసభ్య, ఫేక్‌ పోస్టులు పెట్టే వారితో పాటు వాటిని అత్యుత్సాహంతో సర్క్యులేట్ చేసే వారిని కూడా సైబర్‌ క్రైమ్‌  పోలీసులు విడిచి పెట్టరని హెచ్చరిస్తున్నా.

For All Tech Queries Please Click Here..!
Topics: