IPL 2020 Playoffs Schedule: నవంబర్ 10వ తేదీన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్, పూర్తి షెడ్యూల్ ఇదే
ఐపీఎల్ 13 సీజన్ ప్లేఆఫ్స్ షెడ్యూల్‌ను ప్రకటించారు. ముందస్తు షెడ్యూల్‌లో కేవలం లీగ్ దశలో మ్యాచ్‌లనే వెల్లడించగా, తాజాగా ప్లేఆఫ్స్ వేదికల్ని ఖరారు చేశారు. వచ్చే నెల నవంబర్ 3వ తేదీతో లీగ్ దశలో మ్యాచ్‌లు ముగుస్తుండగా, తాజాగా ప్లేఆఫ్స్ షెడ్యూల్‌ను (IPL 2020 Playoffs Schedule) భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) వెల్లడించింది. నవంబర్ 4వ తేదీన విశ్రాంతి దినం. ఇక నవంబర్5 తేదీన క్వాలిఫయర్-1 మ్యాచ్ జరుగనుంది. దుబాయ్ వేదికగా తొలి క్వాలిఫయర్ జరుగనుంది. పాయింట్ల పట్టికలో టాప్-1, టాప్-2లో నిలిచిన జట్ల మధ్య క్వాలిఫయర్-1 జరుగనుంది.
నవంబర్ 6వ తేదీ ఎలిమినేటర్ మ్యాచ్ టీమ్-3, టీమ్-4 జట్ల మధ్య అబుదాబి వేదికగా జరుగనుంది. ఇక నవంబర్ 8వ తేదీన అబుదాబి వేదికగా క్వాలిఫయర్-2 జరుగనుంది. క్వాలిఫయర్-2లో క్వాలిఫయర్-1లో ఓడిన జట్టు, ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిచిన జట్టు తలపడతాయి. ఐపీఎల్-13 సీజన్ తుది పోరు నవంబర్ 10వ తేదీన దుబాయ్ వేదికగా క్వాలిఫయర్-1లో విజేత, క్వాలిఫయర్-2లో గెలిచిన జట్ల మధ్య జరుగుతుంది. మ్యాచ్‌లన్నీ రాత్రి గం. 7.30ని.లకు ప్రారంభమవుతాయి. మహిళల టీ20 చాలెంజ్‌కు షార్జాను వేదికగా ఖరారు చేయడంతో ఇక్కడ ఐపీఎల్ ప్లేఆఫ్స్ మ్యాచ్‌లు నిర్వహించడం లేదు