KKR vs KXIP IPL 2020: గేల్ జిగేల్..కోల్‌కతాపై 8 వికెట్ల తేడాతో పంజాబ్ ఘన విజయం
వరుసగా ఓటముల తర్వాత పుంజుకున్న కింగ్స్ లెవన్ పంజాబ్ తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. వరుసగా ఐదో విజయాన్ని ఖాతాలో వేసుకుని ప్లే అప్ రేసులోకి వచ్చేసింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో (Kolkata Knight Riders) జరిగిన మ్యాచ్‌లో (KKR vs KXIP Stat Highlights) కింగ్స్ పంజాబ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొత్తంగా కింగ్స్ పంజాబ్‌కు (Kings XI Punjab) ఆరో విజయం కాగా, కేకేఆర్‌కు ఇది ఆరో ఓటమి. ఈ మ్యాచ్‌లో విజయం తర్వాత కింగ్స్ పంజాబ్ నాల్గో స్థానానికి చేరింది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా.. పంజాబ్ బౌలర్ల దెబ్బకు తడబడినా ఓపెనర్ గిల్, కెప్టెన్ మోర్గాన్ (40) ఆదుకోవడంతో ఆమాత్రం స్కోరైనా చేయగలిగింది. ఇన్నింగ్స్ రెండో బంతికే ఓపెనర్ నితీష్ రాణాను డకౌట్ చేసిన మ్యాక్స్‌వెల్.. కోల్‌కతాకు షాకిచ్చాడు. రెండో ఓవర్‌లో బౌలింగ్‌కు దిగిన షమి.. రాహుల్ త్రిపాఠి (7), దినేష్ కార్తీక్ (0)ను కీపర్ క్యాచ్‌తో దెబ్బకొట్టాడు. దీంతో 10/3తో కోల్‌కతా ఇబ్బందుల్లో పడింది. అయితే, గిల్, మోర్గాన్ జాగ్రత్తగా ఆడుతూ స్కోరుబోర్డును నడిపించారు. షమి వేసిన 6వ ఓవర్‌లో ఏకంగా 21 రన్స్ రావడంతో కోల్‌కతా ఇన్నింగ్స్‌లో ఊపొచ్చింది. ఆ ఓవర్‌లో మోర్గాన్ 2 ఫోర్లు, గిల్ 2 సిక్స్‌లు కొట్టారు.
దీంతో పవర్‌ప్లే ముగిసేసరికి నైట్‌రైడర్స్ 54/3తో నిలిచింది. మోర్గాన్‌ను అవుట్ చేసిన బిష్ణోయ్.. నాలుగో వికెట్‌కు 81 రన్స్‌తో జోరుగా సాగుతున్న వీరి భాగస్వామ్యానికి బ్రేకులు వేశాడు. నరైన్ (6)ను జోర్డాన్ బౌల్డ్ చేశాడు. ఈ దశలో బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగుల రాక కష్టమైంది. 11-15 ఓవర్ల మధ్య 22 రన్స్ చేసిన కోల్‌కతా 2 వికెట్లు కోల్పోయింది. 13వ ఓవర్‌లో బిష్ణోయ్ బౌలింగ్‌లో డబుల్‌తో గిల్ ఫిఫ్టీ పూర్తి చేసుకోగా.. తర్వాతి ఓవర్‌లో నాగర్‌కోటి (6)ని మురుగన్ బౌల్డ్ చేశాడు. కమిన్స్(1)ను బిష్ణోయ్, గిల్‌ను షమి అవుట్ చేశారు. వరుణ్ చక్రవర్తి (2)ని జోర్డాన్ వెనక్కిపంపగా.. ఆఖర్లో ఫెర్గూసన్ (24 నాటౌట్) ధాటిగా ఆడాడు. చివరకు పంజాబ్ ముందు 150 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
పంజాబ్ కింగ్స్ లక్ష్యఛేదన ఫోర్‌తో మొదలైంది. కమిన్స్ తొలి బంతిని రాహుల్ బౌండరీకి తరలించాడు. జట్టు స్కోరు 47 పరుగుల వద్ద రాహుల్ (25 బంతుల్లో 28; 4 ఫోర్లు) ఔటయ్యాడు. దీంతో గేల్ క్రీజ్‌లోకి వచ్చాడు. వరుణ్ చక్రవర్తి, నరైన్ బౌలింగ్‌ల్లో భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. మరోవైపు ఓపెనర్ మన్‌దీప్ చూడచక్కని బౌండరీలతో నిలకడగా పరుగులు చేశాడు. 49 బంతుల్లో అర్ధసెంచరీ చేశాడు. జట్టు 13.4 ఓవర్లలో 100 పరుగులను అధిగమించింది. కాసేపటికే గేల్ ఫిఫ్టీ 25 బంతుల్లోనే పూర్తయ్యింది. వీళ్లిద్దరు రెండో వికెట్‌కు సరిగ్గా 100 పరుగులు జత చేశాక గేల్ ఔటైనా... మిగతా లాంఛనాన్ని పూరన్ (2 నాటౌట్)తో కలిసి మన్‌దీప్ పూర్తి చేశాడు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ క్రిస్ గేల్ (29 బంతుల్లో 51; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరిపించగా... మన్‌దీప్ (56 బంతుల్లో 66 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) గెలిపించాడు.
స్కోరు వివరాలు
కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: శుబ్‌మన్ గిల్ (సి) పూరన్ (బి) షమీ 57; నితీశ్ రాణా (సి) గేల్ (బి) మ్యాక్స్‌వెల్ 0; రాహుల్ త్రిపాఠి (సి) కేఎల్ రాహుల్ (బి) షమీ 7; దినేశ్ కార్తీక్ (సి) రాహుల్ (బి) షమీ 0; మోర్గాన్ (సి) అశ్విన్ (బి) రవి బిష్ణోయ్ 40; నరైన్ (బి) జోర్డాన్ 6; నాగర్‌కోటి (బి) అశ్విన్ 6; కమిన్స్ (ఎల్బీడబ్ల్యూ) (బి) రవి బిష్ణోయ్ 1; ఫెర్గూసన్ (నాటౌట్) 24; వరుణ్ చక్రవర్తి (బి) జోర్డాన్ 2; ప్రసిధ్ కృష్ణ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 149.
వికెట్ల పతనం: 1–1, 2–10, 3–10, 4–91, 5–101, 6–113, 7–114, 8–136, 9–149.
బౌలింగ్: మ్యాక్స్‌వెల్ 2–0–21–1, షమీ 4–0–35–3, అర్‡్షదీప్ సింగ్ 2–0– 18–0, మురుగన్ అశ్విన్ 4–0–27–1, జోర్డాన్ 4–0–25–2, రవి బిష్ణోయ్ 4–1–20–2.
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: కేఎల్ రాహుల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) వరుణ్ 28; మన్‌దీప్ సింగ్ (నాటౌట్) 66; క్రిస్ గేల్ (సి) ప్రసిధ్ కృష్ణ (బి) ఫెర్గూసన్ 51; పూరన్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (18.5 ఓవర్లలో 2 వికెట్లకు) 150.
వికెట్ల పతనం: 1–47, 2–147.
బౌలింగ్: కమిన్స్ 4–0–31–0, ప్రసి«ధ్ కృష్ణ 3–0–24–0, వరుణ్ చక్రవర్తి 4–0–34–1, నరైన్ 4–0–27–0, ఫెర్గూసన్ 3.5–0–32–1.