ద‌శాబ్ద‌పు అత్యుత్త‌మ క్రికెట‌ర్‌గా గ్యారీఫీల్డ్ సోబ‌ర్స్ అవార్డ్ అందుకోనున్న విరాట్ కోహ్లీ

Sunday, February 21, 2021 01:15 PM Sports
ద‌శాబ్ద‌పు అత్యుత్త‌మ క్రికెట‌ర్‌గా గ్యారీఫీల్డ్ సోబ‌ర్స్ అవార్డ్ అందుకోనున్న విరాట్ కోహ్లీ

ఐసీసీ అవార్డుల్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ద‌శాబ్ద‌పు అత్యుత్త‌మ క్రికెట‌ర్‌గా (Kohli Named ICC Male Cricketer of the Decade)నిలిచి స‌ర్ గ్యారీఫీల్డ్ సోబ‌ర్స్ అవార్డ్ అందుకోనున్నాడు. అంతేకాదు ఐసీసీ వ‌న్డే క్రికెట‌ర్ ఆఫ్ ద డెకేడ్ అవార్డు కూడా కోహ్లినే వ‌రించింది. టెస్ట్ క్రికెట‌ర్ ఆఫ్ ద డెకేడ్ అవార్డు మాత్రం ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌కు ద‌క్కింది. ఇక ఐసీసీ స్పిరిట్ ఆఫ్ ద క్రికెట్ ఆఫ్ ద డెకేడ్ అవార్డును మిస్ట‌ర్ కూల్ మ‌హేంద్ర సింగ్ ధోనీ గెలుచుకున్నాడు. టీ20 క్రికెట‌ర్ ఆఫ్ ద డెకేడ్ అవార్డును ఆఫ్ఘ‌నిస్థాన్ ప్లేయ‌ర్ ర‌షీద్ ఖాన్ సొంతం చేసుకున్నాడు. ద‌శాబ్ద‌పు టెస్ట్ టీమ్‌కు కెప్టెన్‌గా ఇప్పటికే కోహ్లీ ఎంపికైన సంగతి విదితమే. 
 
విరాట్ కోహ్లి అవార్డు గెలిచిన‌ట్లు ప్ర‌క‌టిస్తూ.. ఈ ద‌శాబ్దంలో అత‌ను సాధించిన ప‌రుగులు, సెంచ‌రీలు, హాఫ్ సెంచ‌రీల‌ను ట్విట‌ర్‌లో  ఐసీసీ షేర్ చేసింది. ఈ ద‌శాబ్దంలో కోహ్లి మొత్తం 20396 ప‌రుగులు చేయ‌గా.. అందులో 66 సెంచ‌రీలు, 94 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 70కి పైగా ఇన్నింగ్స్ ఆడిన ప్లేయ‌ర్స్‌లో కోహ్లిదే (56.97) స‌గ‌టు కావ‌డం విశేషం. ఇక వ‌న్డేల విష‌యానికి వ‌స్తే ఐసీసీ అవార్డుల కాలంలో వ‌న్డేల్లో 10 వేల‌కుపైగా ప‌రుగులు చేసిన ఏకైక క్రికెట‌ర్ కోహ్లియే. అందులో 39 సెంచ‌రీలు, 48 హాఫ్ సెంచ‌రీలు,  112 క్యాచ్‌లు  ఉండ‌గా.. స‌గ‌టు 61.83గా ఉంది.

ఐసిసి పోస్ట్ చేసిన ఒక వీడియోలో, కోహ్లీ తన కెరీర్‌లో మూడు అతిపెద్ద విజయాలు గురించి మాట్లాడాడు, ఇందులో 2011 ఐసిసి ప్రపంచ కప్ విజయం, 2013 ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ విజయం, 2018-19లో ఆస్ట్రేలియాలో తొలి టెస్ట్ సిరీస్ విజయం. కోహ్లీ ప్రస్తుతం ఆస్ట్రేలియా సిరీస్ నుండి స్వదేశానికి తిరిగి వచ్చాడు. త్వరలో విరాట్ తండ్రి కాబోతున్నాడు.
 
2015 ఐసిసి ప్రపంచ కప్‌లో (ICC World Cup) సెమీ ఫైనల్‌కు చేరుకున్న భారత జట్టులో కోహ్లీ కూడా ఒకడు. అతను 2017 ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ మరియు 2019 ఐసిసి ప్రపంచ కప్ యొక్క సెమీ-ఫైనల్కు జట్టుకు నాయకత్వం వహించాడు. 

For All Tech Queries Please Click Here..!