దాదా ముక్కుసూటి మనిషి: కైఫ్
భారత మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ #Helo లైవ్‌లో ముచ్చటించారు. ఈ సందర్భంగా పలు విషయాలను అభిమానులతో పంచుకున్నారు. లాక్‌డౌన్ సమయంలో ఇంట్లో భార్యకు సాయం చేస్తున్నట్లు తెలిపాడు. 2004లో పాక్ పర్యటనలో ఆడిన ఇన్నింగ్స్ తన ఫేవరెట్ ఇన్నింగ్స్ అని కైఫ్ తెలిపాడు. ఇండియన్ టీ20 లీగ్‌లో దిల్లీకి కోచ్‌గా వ్యవహరించడం గొప్ప అనుభమన్నాడు.
దాదా ముక్కుసూటి మనిషి. తక్కువ సమయంలో చాలా మంచి నిర్ణయాలు తీసుకునేవాడు. కరోనా కారణంగా క్రికెట్‌ని చాలా మిస్సవుతున్నాం. మహేంద్ర సింగ్ ధోనీకి నేను అభిమానిని. టీ20 ప్రపంచకప్ గురించి మాట్లాడుతూ... కంగారూల గడ్డపై జరుగుతుంది కాబట్టి ఆసీస్ జట్టుకు అవకాశం ఉంది. హార్దిక్, పాండ్య, రోహిత్ లాంటి ఆటగాళ్లు ఉన్న భారత జట్టు కూడా ఫేవరెట్ జట్టే.
2002లో యువరాజ్ సింగ్‌తో కలిసి దిగిన ఓ ఫొటోను కైఫ్ అభిమానులకు చూపించాడు. ప్లేయర్ ఫిట్‌గా ఉంటే 40 ఏళ్ల వరకు ఆడొచ్చని, కేఎల్ రాహుల్ చాలా ఫిట్‌గా ఉంటాడని చెప్పాడు. సక్సెస్‌కి షార్ట్ కట్ ఉండదు. సక్సెస్ దక్కించుకోవాలంటే ఎంతో కష్టపడాలి, కొన్ని త్యాగాలు కూడా చేయాలని కైఫ్ చెప్పాడు. భారత్ తరఫున ఆడేందుకు ఎంతో మంది వేచి చూస్తున్నారు.
లక్ష్మీపతి బాలాజీ, యువరాజ్ సింగ్ తమ హయాంలో ఎంతో ఫిట్‌గా ఉండేవారని తెలిపాడు. అనంతరం తన లవ్ స్టోరీ గురించి చెప్పాడు.