ఐపీఎల్‌లో ఆడే అవకాశం వస్తే చెన్నైకి ఆడతా: శ్రీశాంత్

Friday, May 29, 2020 01:11 PM Sports
ఐపీఎల్‌లో ఆడే అవకాశం వస్తే చెన్నైకి ఆడతా: శ్రీశాంత్

మళ్లీ ఐపీఎల్‌లో ఆడే అవకాశం వస్తే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున ఆడతానని టీమిండియా పేసర్ శ్రీశాంత్ తెలిపాడు. గురువారం  శ్రీశాంత్ Helo లైవ్‌లో అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంతగా పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

ప్రత్యర్ధి జట్ల కెప్టెన్లను ఔట్ చేసేందుకు ఎక్కువ ఇష్టపడతానని చెప్పాడు. ధోనీ ఎప్పటికీ మ్యాచ్ విన్నరే అని శ్రీశాంత్ అన్నాడు. రెండు రోజుల క్రితం ధోనీపై స్టోక్స్ చేసిన వ్యాఖ్యల గురించి శ్రీశాంత్ మాట్లాడుతూ... ధోనీ గురించి స్టోక్స్ కి ఏమి తెలుసు? ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తావు? స్టోక్స్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు, నువ్వు ధోనీని ఔట్ చేయలేవు అని శ్రీశాంత్ అన్నాడు. 

అనంతరం శ్రీశాంత్ తన డ్రీమ్ వన్డే జట్టును ప్రకటించాడు. ఐపీఎల్ లో ముంబయి, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ తన ఫేవరెట్ జట్లని, ఈ ఏడాది ఐపీఎల్ జరిగితే ముంబయి ట్రోఫీ గెలవాలని కోరుకుంటానని అన్నాడు. ఒకవేళ నేను చెన్నై తరఫున ఆడితే అప్పుడు మాత్రం చెన్నై విజేతగా నిలవాలి. 

కరోనా కారణంగా బౌలర్లు బంతిపై ఉమ్మి రాయకూడదన్న కొత్త నిబంధన గురించి మాట్లాడుతూ... ఇది కొంచెం కష్టం. కానీ, అది నిబంధన అయినప్పుడు తప్పనిసరిగా అందరూ పాటించాలి.  ఏబీ డివిలియర్స్ గొప్ప ఆటగాడు. నేను అతడ్ని 7 సార్లు ఔట్ చేసినట్లు గుర్తు చేసుకున్నాడు.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: