43 Chinese Apps Banned: మళ్లీ 47 చైనా యాప్స్‌పై నిషేధం విధించిన MeitY
New Delhi, November 23: భారతదేశం, చైనా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం మరోసారి 43 మొబైల్ యాప్‌లను (43 Chinese Apps Banned) నిషేధించింది. భారత సార్వభౌమాధికారం, సమగ్రత, రక్షణ, భద్రతకు వీటి వల్ల ముప్పు వాటిల్లుతోందంటూ ఈ యాప్‌లపై నిషేధం విధించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం సెక్షన్ 69ఎ కింద వీటిని నిషేధించినట్లు ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (Ministry of Electronics and Information Technology) వెల్లడించింది.
ప్రభుత్వం జారీ చేసిన నిషేధపు జాబితా మూడవది ఇది, ఈ జాబితాలో గుర్తించదగిన పేర్లు ఇ-కామర్స్ సంస్థ అలీఎక్స్‌ప్రెస్, స్నాక్ వీడియో - టిక్‌టాక్ నిషేధం తరువాత ప్రజాదరణ పొందాయి. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ఇచ్చిన సమాచారం మేరకు ఈ యాప్‌లకు యాక్సెస్‌ను బ్లాక్ చేస్తూ సదరు మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. కాగా చైనా యాప్ లపై నిషేధం కొనసాగుతూనే ఉంది. ఈ ఏడాది జూన్‌లో 59, సెప్టెంబర్‌లో మరో 118 యాప్‌లను కూడా నిషేధించిన సంగతి తెలిసిందే.
నిషేధానికి గురైన 43 యాప్ ల వివరాలు
అలీసప్లయర్స్
అలీబాబా వర్క్‌బెంచ్
అలీఎక్స్‌ప్రెస్-స్మార్టర్ షాపింగ్, బెటర్ లివింగ్
అలీపే క్యాషియర్
లాలామూవ్ ఇండియా - డెలివరీ యాప్
స్నాక్ వీడియో
క్యామ్‌కార్డ్ - బిజినెస్ కార్డ్ రీడర్
క్యామ్‌కార్డ్ - బీసీఆర్ (వెస్టర్న్)
సోల్ - ఫాలో ద సోల్ టు ఫైండ్ యూ
చైనీస్ సోషల్ - ఫ్రీ ఆన్‌లైన్ డేటింగ్ వీడియో యాప్
డేట్ ఇన్ ఏషియా - డేటింగ్ & చాట్
వీడేట్ - డేటింగ్ యాప్
ఫ్రీ డేటింగ్ యాప్ - సింగోల్, స్టార్ట్ యువర్ డేట్
అడోర్ యాప్
ట్రూలీచైనీస్ - చైనీస్ డేటింగ్ యాప్
ట్రూలీ ఏషియన్ - ఏషియన్ డేటింగ్ యాప్
చైనాలవ్
డేట్‌మై ఏజ్
ఏషియన్‌డేట్
ఫ్లర్ట్‌విష్
గయ్స్ ఓన్లీ డేటింగ్
ట్యూబిట్
వీవర్క్‌చైనా
ఫస్ట్ లవ్ లివ్
రెలా-లెస్బియన్ సోషల్ నెట్‌వర్క్
క్యాషియర్ వాలెట్
మ్యాంగో టీవీ
ఎంజీటీవీ-హ్యూనన్ టీవీ అఫీషియల్ టీవీ యాప్
వియ్‌టీవీ
వియ్‌టీవీ లైట్
లక్కీ లైవ్
తావోబావో లైవ్
డింగ్‌టాక్
ఐడెంటిఫై బి
ఐసోల్యాండ్ 2: యాషెస్ ఆఫ్ టైమ్
బాక్స్‌స్టార్
హీరోస్ ఇవాల్వ్‌డ్
హ్యాపీ ఫిష్
జెల్లీపాప్ మ్యాచ్
మంచ్‌కిన్ మ్యాచ్
కాన్‌క్విస్టా ఆన్‌లైన్ 2