Vivo Diwali Offer: రూ.101 కే వివో స్మార్ట్‌ఫోన్లను సొంతం చేసుకోండి
రానున్న దీపావళి పండగ సీజన్‌ను పురస్కరించుకుని స్మార్ట్‌ఫోన్ తయారీదారు వివో బంపర్ ఆఫర్ (Vivo Diwali Offer) ప్రకటించింది. పండుగ సందర్భంగా వీ 20ఎస్, వీ 20, ఎక్స్ 50 సీరిస్ స్మార్ట్‌ఫోన్లను 101 రూపాయలకే సొంతం చేసుకోవచ్చని తెలిపింది. అలాగే ఐసీఐసీఐ, కోటక్, ఫెడరల్‌బ్యాంకు , బ్యాంక్ ఆఫ్‌బరోడాల కార్డు కొనుగోళ్లపై 10శాతం క్యాష్‌బ్యాక్ అందిస్తోంది.
దీపావళి ఆఫర్లతో కొత్త ఆనందాన్ని వెలిగించండి అంటూ వివో (Vivo) తాజాగా ట్వీట్ చేసింది. కేవలం రూ. 101 చెల్లించి (Vivo offers smartphone for just Rs 101) మీ కెంతో ఇష్టపడే వివో ఫోన్‌ను సొంతం చేసుకోండి. దీంతోపాటు అదనపు ప్రయోజనాలను కూడా ఆస్వాదించండని పేర్కొంది. అయితే ఎప్పటినుంచి ఎప్పటివరకు ఈ ఆఫర్ అందుబాటులోఉండనుందీ స్పష్టత ఇవ్వలేదు.
ఈ ఆఫర్ ప్రకారం మొదట 101 రూపాయల డౌన్ పేమెంట్ చెల్లించి పైన పేర్కొన్న వాటిలో నచ్చిన స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. అనంతరం ఫోన్ విలువ మొత్తాన్ని ఎంపికచేసిన సులభ ఈఎంఐ వాయిదాలలో చెల్లించాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే మొబైల్ కంపెనీలు పండుగ సమయాల్లో డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించడం సాధారణమేనని వినియోగదారులు అంటున్నారు.