Airtel Sim ఓనర్ నంబర్ ఎవరో తెలుసుకోవడం ఎలా ? మిట్టల్ తొలి పెట్టుబడి ఎంతో తెలుసా? 

Sunday, January 10, 2021 04:15 PM Technology
Airtel Sim ఓనర్ నంబర్ ఎవరో తెలుసుకోవడం ఎలా ? మిట్టల్  తొలి పెట్టుబడి ఎంతో తెలుసా? 

ఇప్పుడు కొత్తగా ఎవరైనా సిమ్ తీసుకోవాలంటే ఆధార్ కార్డును అడ్రస్ ప్రూఫ్ కింద సమర్పించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో  మీరు వాడుతున్న సిమ్ మీ పేరు మీద ఉందా లేక వేరే వారి పేరు మీద ఉందా అన్ని విషయాలను తెలుసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్..ఎయిర్ టెల్ కష్టమర్లు ఈ సింపుల్ ట్రిక్స్ ద్వారా దాన్ని తెలుసుకోవచ్చు.    

Tricks 
1. ముందుగా మీరు Airtel అఫిషియల్ వెబ్ పేజీలోకి వెళ్లాలి. అక్కడ మీకు Airtel.in Selfcare Login అనే ఆప్సన్ కనిపిస్తుంది. 
2. అది క్లిక్ చేయగానే మీకు అక్కడ నంబర్ అలాగే పాస్‌వర్డ్ ఎంటర్ చేయాలి. మీరు పాస్‌వర్డ్ మరచిపోయినట్లైతే గెట్ ఓటీపీ అనే ఆప్సన్ క్లిక్ చేస్తే మీ నంబర్ కు ఓటీపీ వస్తుంది. 
3. అది ఎంటర్ చేసిన తరువాత మీకు అక్కడ Airtel Manage account అనే ఆప్సన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు సిమ్ నంబర్ ఓనర్ పేరు కనిపిస్తాయి. నంబర్ మీద క్లిక్ చేసి మీరు పూర్తి వివరాలను పొందవచ్చు. 
4. ఇక్కడ మీకు అడ్రస్, సిమ్ ఓనర్ పేరు, రెసిడెన్సియల్ అడ్రస్, సిమ్ యాక్టివేషన్ డేట్,స్టేటస్, ఫ్రీ పెయిడ్ ఆర్ పోస్ట్ పెయిడ్, కస్టమర్ ఐడీ,వంటి వివరాలు అన్నీ కనిపిస్తాయి.
 
తన 18 ఏళ్ల వయసులో సునీల్ మిట్టల్ వ్యాపార సామ్రాజ్యంలోకి అడుగుపెట్టారు. 1976 ఏప్రిల్ నెలలో తన ఫస్ట్ వ్యాపారాన్ని సునీల్ మిట్టల్ ప్రారంభించారు. అప్పుడు అతని పెట్టుబడి కేవలం రూ. 20 వేలు మాత్రమే. అదీ తన తండ్రి దగ్గర ఆ మొత్తాన్ని అప్పుగా తీసుకున్నారు. అతని తొలి వ్యాపారం లోకల్ సైకిళ్లను తయారుచేయడం. ఆ తరువాత మరో రెండు రంగాల్లోకి ప్రవేశించారు. అయితే ట్రావెలింగ్ సమస్య సునీల్ మిట్టల్ ని బాగా వేధించడంతో అనుకున్నంతగా అది ముందుకు సాగలేదు. ట్రక్‌లో సామాన్లు వేసుకుని రోజుకు 16 నుంచి 18 గంటల ప్రయాణంలోనే గడిపేవాడు.

సునీల్ మిట్టల్ తండ్రీ Sat Paul Mittal ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరపున రాజ్యసభ మెంబర్ కూడా. పంజాబ్ నుంచి రెండు ఎంపీగా గెలుపొందారు. రాజ్యసభకు ఒకసారి నామినేట్ అయ్యారు. సునీల్ మిట్టల్ ను ఉద్దేశించి నా కొడుకు నాలాగా కాకుండా మంచి వ్యాపారవేత్తగా పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నానని చెప్పారు. తమ గ్రూప్ దాతృత్వ సంస్థ భారతి ఫౌండేషన్‌కు భారీగా విరాళం అందించారు. తమ కుటుంబ సంపద నుంచి 10 శాతం అంటే మొత్తం రూ.7000 కోట్లను విరాళంగా అందించనున్నట్ట ప్రకటించారు. ఈ మొత్తంలోనే భారతీ ఎయిర్‌టెల్‌లో తమ కుటుంబానికి ఉన్న వాటా 3 శాతం కూడా ఉంది.
 
అదేవిధంగా వెనుకబడిన వర్గాల నుంచి వచ్చిన బలహీన యువతకు ఉచితంగా విద్యను అందించడానికి భారతీ కుటుంబం, సత్యభారతి యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు.ఈ కొత్త యూనివర్సిటీ సైన్సు అండ్‌ టెక్నాలజీపై దృష్టిసారించనుంది. వీటిలో ముఖ్యంగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, రోబోటిక్స్‌ వంటి వాటిపై ఎక్కువగా ఫోకస్‌ చేయనుంది. ఈ యూనివర్సిటీని ఉత్తర భారత్‌లో ఏర్పాటు చేయనున్నట్టు తెలిసింది. తొలి అకాడమిక్‌ సెషన్‌ 2021 నుంచి ప్రారంభం కాబోతుంది. మొత్తం 10వేల మంది విద్యార్థులతో ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నారు.
 

For All Tech Queries Please Click Here..!