గేమింగ్ వినియోగదారులే లక్ష్యంగా మార్కెట్లోకి టెక్నో పోవా స్మార్ట్‌ఫోన్
చైనాకు చెందిన ట్రాన్స్‌షన్ హోల్డింగ్స్ యాజమాన్యంలోని టెక్నో బ్రాండ్ ఇటీవల టెక్నో పోవా సరికొత్త మోడల్ స్మార్ట్‌ఫోన్ ను విడుదల చేసింది. గేమింగ్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకొని కంపెనీ ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ ను విడుదల చేసింది. ఈ ఫోన్ ఇప్పటికే నైజీరియా, ఫిలిప్పీన్స్‌తో సహా కొన్ని మార్కెట్లలో అందుబాటులో ఉంది. షియోమికి చెందిన రెడ్‌మి 9, రియల్‌మీ నార్జో 20లతో ఈ ఫోన్ పోటీ పడగలదని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ మొబైల్ లో క్వాడ్ రియర్ కెమెరా6,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ మరియు మీడియాటెక్ హెలియో జీ80 ప్రాసెసర్తో వచ్చింది.
టెక్నో పోవా ఫీచర్లు
6.8 అంగుళాల హెచ్‌డీ+డాట్-ఇన్ డిస్ ప్లే, 720×1640 పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో జీ80 ప్రాసెసర్, 4జీబీ + 6 జీబీ ర్యామ్, 64జీబీ+128 జీబీ స్టోరేజ్, 16 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా క్వాడ్ రియర్ కెమెరా సెటప్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్, మరో ఏఐ లెన్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
సెల్ఫీ కోసం 8 మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 10 ఆధారిత హైఓఎస్ 7ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 6000 ఎంఏహెచ్ కాగా, 18వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఇందులో ఉంది. మ్యాజిక్ బ్లూ, స్పీడ్ పర్పుల్, డాజిల్ బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది. కనెక్టివిటీ కోసం వై-ఫై, ఎల్‌టిఇ, జిపిఎస్, బ్లూటూత్ ఉన్నాయి. దీనిలో ఎఫ్‌ఎం రేడియో సపోర్ట్ కూడా ఉంది.
భారతదేశంలో టెక్నో పోవా ధర రూ. బేస్ 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్‌కు 9,999 ఉండగా, 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ. 11,999. ఈ ఫోన్ డిసెంబర్ 11న మధ్యాహ్నం ఫ్లిప్ కార్ట్ లో మొదటి సేల్ కు రానుంది.