WhatsApp Payments: వాట్సాప్ నుంచి డబ్బులు పంపడం, రిసీవ్ చేసుకోవడం ఎలా ?
వాట్సాప్ ఎట్టకేలకు తన చెల్లింపుల ఫీచర్‌ని భారతదేశంలో విడుదల చేసింది. వాట్సాప్ పే నెమ్మదిగా దేశవ్యాప్తంగా ప్రజలకు అందుబాటులోకి వస్తోంది. వాట్సాప్ చెల్లింపులు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లేదా ఎన్‌పిసిఐ భాగస్వామ్యంతో రూపొందించబడ్డాయి. ఇది యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ లేదా యుపిఐ ఆధారంగా రూపొందించబడింది. ప్రారంభించడానికి మీరు Android లేదా iOS కోసం వాట్సాప్ యొక్క తాజా వెర్షన్‌లో ఉండాలి. మీ వాట్సాప్ నంబర్ మీ బ్యాంక్ ఖాతాకు లింక్ చేయబడిన అదే సంఖ్యగా ఉండాలి. వాట్సాప్ చెల్లింపుల గురించి మీరు తెలుసుకోవలసిన ప్రతిదాన్ని మేము మీకు చెబుతున్నందున ఈ కథనాన్ని చదవండి.
వాట్సప్ పేమెంట్స్ ఫీచర్ వాడుకునేముందు యూజర్లు తమ యాప్‍ను అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది.
ఆ తర్వాత మీ ఫోన్‌లో వాట్సప్ యాప్ ఓపెన్ చేయండి.
కుడివైపు పైభాగంలో ఉన్న త్రీ డాట్స్ క్లిక్ చేయండి. అందులో Payments ఆప్షన్ ఉంటుంది.
ఆ ఆప్షన్‌పైన క్లిక్ చేసిన తర్వాత Add payment method పైన క్లిక్ చేయాలి.
వాట్సప్ పేమెంట్స్ సర్వీస్ ఉపయోగించాలంటే టర్మ్స్ అండ్ కండీషన్స్ అంగీకరించాల్సి ఉంటుంది.
నియమనిబంధనలు చదివిన తర్వాత Accept and Continue పైన క్లిక్ చేయాలి.
ఆ తర్వాత కనిపించే బ్యాంకుల లిస్ట్ నుంచి మీకు అకౌంట్ ఉన్న బ్యాంకును సెలెక్ట్ చేయాలి.
అకౌంట్ నెంబర్‌కు లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్‌కు వెరిఫికేషన్ మెసేజ్ వస్తుంది. వెరిఫై చేసిన తర్వాత అకౌంట్ నెంబర్లు కనిపిస్తాయి. అకౌంట్ సెలెక్ట్ చేస్తే అకౌంట్ సెటప్ పూర్తవుతుంది.
మరో పద్దతి ద్వారా..
వాట్సప్ ద్వారా రెండు పద్ధతుల్లో డబ్బులు పంపడం సాధ్యం అవుతుంది. పైన చెప్పింది మొదటి పద్దతి. రెండో పద్దతిలో.. మీరు డబ్బులు పంపాలనుకు వారి ఛాట్ విండో ఓపెన్ చేసిన తర్వాత అటాచ్‌మెంట్ పైన క్లిక్ చేయాలి. అందులో Payment ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. సెండ్ మనీ పైన క్లిక్ చేసి అమౌంట్ టైప్ చేసి యూపీఐ పిన్ ఎంటర్ చేయాలి. యూపీఐ పిన్ ఎంటర్ చేస్తే డబ్బులు ట్రాన్స్‌ఫర్ అవుతాయి.
రెండో పద్ధతి ద్వారా డబ్బులు పంపాలనుకుంటే వాట్సప్ ఓపెన్ చేసి రైట్ టాప్‌లో త్రీ డాట్స్ పైన క్లిక్ చేయాలి. అందులో Payments ఆప్షన్‌లో న్యూ పేమెంట్ పైన క్లిక్ చేసి మీ కాంటాక్ట్స్ లిస్ట్‌లో పేరు సెలెక్ట్ చేయాలి. ముందు చెప్పిన ప్రాసెస్‌లోనే డబ్బులు పంపాలి. అయితే అవతలివాళ్లు కూడా వాట్సప్ పేమెంట్స్ సెటప్ చేసుకుంటేనే డబ్బులు పంపడానికి వీలవుతుంది.
How to Send and Receive Money (Fisrt one)
Open WhatsApp > go to Settings > tap Payments.
Tap Add payment method. Next, choose your bank.
After you've selected your bank, you'll need to verify your phone number. Tap Verify via SMS.
Wait for the verification process to finish. Once done, your bank details will be added below Payment methods.
How to Send and Receive Money (Second one)
Open a WhatsApp chat and tap the attachment icon.
Tap Payment > type the desired amount > hit enter.
Enter your UPI pin to complete the payment.
How to Send and Receive Money (Third one)
Open WhatsApp > go to Settings > tap Payments.
Tap New Payment > tap Send to a UPI ID > enter the UPI ID > hit Verify.
After the UPI ID is verified, type the desired amount and hit enter.
Enter your UPI pin to complete the paymen