బజాజ్ కావాలనే ఇంత పని చేసిందా..?

Automobiles Published On : Tuesday, December 3, 2019 10:22 AM

బజాజ్ ఆటో విడుదలకు ముందే తమ బజాజ్ పల్సర్ ఆర్ఎస్ 200 డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ బైక్ ధరలను తమ వైబ్‌సైట్లో అధికారికంగా లీక్ చేసింది.  ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ రేసింగ్ మోటార్ సైకిల్‌ను అతి త్వరలో మార్కెట్లోకి విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. బజాజ్ పల్సర్ ఆర్ఎస్200 స్పోర్ట్ & రేసింగ్ వెర్షన్ మార్కెట్లో మోస్ట్ పాపులర్ బైకు. బజాజ్ పల్సర్ ఆర్ఎస్200 డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ మోటార్ సైకిల్ ధర రూ. 1.43 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ) ఉన్నట్లుగా తెలిసింది.

కేవలం వెయ్యి రూపాయల ధరతోనే బ్రేకింగ్‌లో అత్యంత కీలకమైన టెక్నాలజీ డ్యూయల్-ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఫీచర్‌‌ను తమ మోస్ట్ పాపులర్ మోటార్ సైకిల్ ఆర్ఎస్200లో అందించారు. పోటీని ఎదుర్కొని సేల్స్ పెంచుకునేందుకు బజాజ్ ఈ బైకులో కీలక అప్‌గ్రేడ్స్ నిర్వహించింది. సరసమైన ధరలో లభించే ఆర్ఎస్200 మోడల్‌ను అతి త్వరలో బిఎస్-6 ‌ఇంజన్‌తో అప్‌గ్రేడ్ చేయనున్నారు.