ఇన్నోవా క్రిస్టాకు పోటీగా 11-సీటర్ కార్నివాల్
కొరియాకు చెందిన ప్రఖ్యాత ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ కియా మోటార్స్ దేశీయంగా కార్యకలాపాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అనంపురంలోని పెనుకొండ కియా కార్ల తయారీ ప్లాంటులో మొదటి కారుకు టెస్ట్ రన్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. కియా మోటార్స్ ఇండియా విభాగం దేశీయ విపణిలోకి తొలి ఉత్పత్తిగా కియా ఎస్‌పి2ఐ ఎస్‌యూవీ లాంచ్ చేయాలని భావిస్తోంది. ఇటీవల కాలంలో ఎస్‌యూవీ వాహనాలకు గిరాకీ అధికమవుతున్న నేపథ్యంలో సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది.
అయితే, ఎస్‌యూవీ విభాగం తర్వాత కుటుంబ అవసరాలకు ఎక్కువగా ఎంచుకుంటున్న ఎమ్‌పీవీ సెగ్మెంట్ మీద కియా దృష్టి సారించింది. ఈ తరుణంలో కియా అంతర్జాతీయ మార్కెట్లో విక్రయిస్తున్న కార్నివాల్ మోడల్‌ను ప్రత్యేకించి ఇండియన్ మార్కెట్ కోసం తీసుకొచ్చేందుకు కసరత్తులు ప్రారంభించింది.
ఇదే సెగ్మెంట్లో ఉన్న టయోటా ఇన్నో క్రిస్టా అత్యధిక విక్రయాలు జరుపుతోంది. దీంతో ఇన్నోవా క్రిస్టా మోడల్‌కు ఈ కియా కార్నివాల్ గట్టి పోటీనివ్వనుంది. కియా కార్నివాల్ 7, 8, 9 మరియు 11 సీటింగ్ కెపాసిటీతో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అదే విధంగా 2.4-లీటర్ మరియు 2.8-లీటర్ డీజల్ ఇంజన్ మరియు 2.7-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌లు పరిచయం అవకాశం ఉంది.