మార్కెట్లోకి మహీంద్రా సుప్రో అంబులెన్స్: ధర రూ. 6.94 లక్షలు
మహీంద్రా అండ్ మహీంద్రా ఇండియన్ మార్కెట్లోకి సరికొత్త బీఎస్6 మహీంద్రా సుప్రో అంబులెన్స్‌ను విడుదల చేసింది. LX మరియు ZX అనే రెండు విభిన్న వేరియంట్లలో లభించే దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 6.94 లక్షలుగా ఉంది.
మహారాష్ట్ర ప్రభుత్వ కోసం తొలి విడత మహీంద్రా సుప్రో ఉత్పత్తిని అతి త్వరలో ప్రారంభిస్తున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు అంబులెన్స్‌ల అవసరం ఉన్న నేపథ్యంలో వీలైనంత త్వరగా కొత్త అంబులెన్స్‌లు కావాలని మహారాష్ట్ర ప్రభుత్వతం మహీంద్రా సంస్థను కోరింది. ఇది వరకే 12 మహీంద్రా సుప్రో అంబులెన్స్ వాహనాలను ముంబాయ్ సిటీకి సరఫరా చేశారు.
సాంకేతికంగా ఇందులో రెండు సిలిండర్ల బీఎస్6 డీజల్ ఇంజన్ కలదు, 47బిహెచ్పి పవర్ మరియు 100ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేసే శక్తివంతమైన ఇంజన్ ఎలాంటి ఒడిదుడుకులనైనా సునాసయంగా ఎదుర్కొంటుంది.
అతి ముఖ్యమైన మెడికల్ సామాగ్రిని మహీంద్రా సంస్థ ఫ్యాక్టరీ ఫిట్టింగ్స్‌తో సహా ఈ అంబులెన్సులో అందిస్తోంది. మడిపేవీలున్న స్ట్రెచర్, మెడికల్ కిట్ బాక్స్, ఆక్సిజన్ సిలిండర్, అగ్నిమాపక పరికరాలు, లైటింగ్, మంటలను తట్టుకునే ఇంటీరియర్ వంటి ప్రత్యేకతలకు దీని సొంతం.