భారీగా పెరిగిన టాటా హెక్సా ధరలు: హ్యారియర్ కంటే మరింత ప్రియం!

Automobiles Published On : Tuesday, January 29, 2019 08:00 AM

టాటా మోటార్స్ దేశీయంగా అందుబాటులో ఉంచిన హెక్సా ప్రీమియం క్రాసోవర్ ఎస్‌యూవీ మోడల్ ధరను భారీగా పెంచింది. టాటా హెక్సా ప్రారంభ వేరియంట్ల మీద రూ. 19,505 నుండి టాప్ ఎండ్ వేరియంట్ల మీద గరిష్టంగా రూ. 42,000 వరకు ధరలను పెంచింది.

ఈ ధరల పెంపుకు మునుపు టాటా హెక్సా ఎంట్రీ లెవల్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 12.57 లక్షలు ఉండగా... ధరల పెంపు అనంతరం ఇదే వేరియంట్ ధర రూ. 12.99 లక్షలకు చేరుకుంది. అదే విధంగా రూ. 18.16 లక్షలుగా ఉన్న టాటా హెక్సా ఎక్స్‌టి(XT) వేరియంట్ ధర ఇప్పుడు రూ. 17.97 లక్షలకు పెరిగింది.

కేవలం ఒక్క టాటా హెక్సా మోడల్ మీదనే ధరలు పెంచడానికి గల ప్రధాన కారణం, ప్రస్తుతం టాటా మోటార్స్ ప్యాసింజర్ కార్ల లైనప్‌లో హెక్సా మోడల్ స్థానాన్ని పటిష్టపరిచేందుకు ధరలను సవరించినట్లు తెలుస్తోంది. ఈ తాజా ధరల పెంపుతో టాటా హెక్సా ఇప్పుడు ఇటీవలె విడుదలైన టాటా హ్యారియర్ లగ్జరీ ఎస్‌యూవీ కంటే మరింత ప్రియమైంది. టాటా హెక్సా 7-సీటింగ్ లేఔట్లో 2.2-లీటర్ డీజల్ ఇంజన్‌తో అదే విధంగా టాటా హ్యారియర్ 5-సీటింగ్ లేఔట్లో 2.0-లీటర్ డీజల్ ఇంజన్‌తో లభ్యమవుతున్నాయి.

ఆటోమొబైల్స్‌‌కు సంభందించిన మీ సందేహాలను నివృత్తి చేసుకోవడానికి క్రింది కామెంట్ సెక్షన్ ద్వారా మీ ప్రశ్నలకు మాకు రాయండి...