సిబిల్ స్కోరు ఎక్కువగా ఉంటే లోన్ వచ్చేస్తుందా?

Business Published On : Sunday, February 9, 2025 10:07 PM

క్రెడిట్ స్కోరు (సిబిల్ స్కోరు) ఎక్కువగా ఉంటే తప్పకుండా లోన్ వస్తుందనేది చాలామంది అనుకుంటారు. అయితే అది కేవలం లోన్ అప్లికేషన్ ను ఆమోదించేందుకు మాత్రం ప్రాథమికంగా పనికొస్తుందని నిపుణులు అంటున్నారు.

అనుకున్నంత లోన్ సొమ్ము వస్తుందనే హామీ ఉండదని చెబుతున్నారు. ఆర్థిక క్రమశిక్షణతోపాటు బ్యాంకు అకౌంట్లు సరిగా నిర్వహించేవారికి బ్యాంకులు త్వరగా లోన్లు ఇస్తాయని చెబుతున్నారు.