భారత్ లోకి టెస్లా.. ఉద్యోగాల భర్తీకి ప్రకటన
ఈవీ దిగ్గజం టెస్లా భారత్ లోకి అడుగుపెట్టనుంది. మొదటగా భారత్లో రిక్రూట్మెంట్ చేపట్టనుంది. ఈ మేరకు లింక్డ్ ఇన్ లో ఉద్యోగాల భర్తీకి ప్రకటన చేసింది. కస్టమర్ రిలేటేడ్, బ్యాక్ఎండ్ జాబులు భర్తీ చేయనుంది. జాబ్ లొకేషన్ ముంబయి, ఢిల్లీ అని పేర్కొంది.
ఇటీవలే భారత్ రూ.34 లక్షలపైన ధర ఉన్నకార్లకి ట్యాక్స్ 110 శాతం నుంచి 70కు తగ్గించింది. అంతేకాకుండా మోదీ అమెరికా పర్యటనలో ప్రధానితో ఎలాన్ మస్క్ భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో టెస్లా ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.