అలోవెరా జ్యూస్ అనుకొని తాగేసింది..ఆస్పత్రికి తీసుకెళ్లగా..
అలోవేరా జ్యూస్ అనుకొని పురుగుల మందు తాగి 14 ఏళ్ల బాలిక మరణించిన విషాదకర ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటు చేసుకుంది. బెంగళూరుకు చెందిన దీపాంజలికి అలోవెరా జ్యూస్ తాగే అలవాటు ఉంది. ఎప్పటిలాగే ఇంట్లో ఉన్న జ్యూస్ తాగే బాటిల్ తీసుకొని తాగేసింది.
అయితే అంతకుముందే అందులో జ్యూస్ అయిపోవడంతో ఆ బాలిక తల్లిదండ్రులు ఆ డబ్బాలో పురుగుల మందు లిక్విడ్ పోసి పెట్టారు. అది గమనించకపోవడంతో దీపాంజలి తీవ్ర అస్వస్థతకు గురైంది. తల్లిదండ్రులు వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది.