ఒక్క క్షణం ప్రాణం తీసింది
వయసుకు వచ్చిన 18 ఏళ్ళ యువతి కరెంట్ షాక్ తగిలి మృతి చెందింది. ఈ విషాదకర ఘటన కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో చోటుచేసుకుంది. ఇంట్లో నీటి ట్యాంక్ నింపాలని మోటార్ స్విచ్ ఆన్చేస్తుండగా నిసర్గ (18) అనే యువతి కరెంటు షాక్ కొట్టి అక్కడికక్కడే మరణించింది.
ఈ దుర్ఘటన శుక్రవారం రాత్రి హొళెహొన్నూరు సమీపంలోని ఎమ్మెహట్టి గ్రామంలో జరిగింది. యువతి హొళెహొన్నూరులోని ప్రభుత్వ కాలేజీలో పీయూసీ (ఇంటర్) చదువుతోంది. అప్పటి వరకూ కళ్లముందున్న కూతురు క్షణాల్లో విగతజీవి కావడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు.