పరువు కోసం కూతురుని క్రూరంగా చంపిన తండ్రి
వేరే కులానికి చెందిన యువకుడిని ప్రేమించిందనే కారణంతో సొంత కుమార్తెను ఓ తండ్రి నిర్దాక్షిణ్యంగా హత్య చేసిన ఘటన కర్ణాటకలోని బీదర్ జిల్లా బరాగెన్ తండాలో వెలుగులోకి వచ్చింది.
ఇతర కులానికి చెందిన యువకుడిని మౌనిక (18) ప్రేమించిందని ఆమె తండ్రి మోతీరామ్ జాదవ్ తెలుసుకున్నాడు. కోపంతో రగిలిపోయాడు. ఆమెను కర్రతో దారుణంగా కొట్టి చంపాడు. సంత్పురా పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.