ఘోర రైలు ప్రమాదం.. నిలిచిన రైళ్ల రాకపోకలు

Crime Published On : Tuesday, February 4, 2025 12:47 PM

ఉత్తర ప్రదేశ్ లో మంగళవారం ఉదయం ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఫతేపూర్లోని పంభీపూర్ సమీపంలో సిగ్నల్ లేకపోవడంతో ఆగి ఉన్న గూడ్స్ రైలును వెనుక నుండి మరో గూడ్స్ రైలు ఢీకొట్టింది.

గార్డ్ కోచ్, ఇంజిన్ పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదం కారణంగా రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ ప్రమాదంలో డ్రైవర్ సహా ఇద్దరు రైల్వే అధికారులకు స్వల్ప గాయాలయ్యాయి.