ఇమ్రాన్ కోసం పిల్లల ముందే భర్త గొంతు కోసి చంపిన పూజ

Crime Published On : Tuesday, February 11, 2025 12:47 PM

పిల్లల ముందే భర్తను ఓ మహిళ గొంతు కోసి చంపిన దారుణ ఘటన ముంబైలో చోటు చేసుకుంది. ఈ ఘటన ఫిబ్రవరి 3న జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాజేష్ చౌహాన్ (30), పూజ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త ఫ్రెండ్ ఇమ్రాన్ మన్సూరితో పూజ అక్రమ సంబంధం పెట్టుకుంది.

తమ మధ్య భర్త రాజేష్ అడ్డుగా ఉన్నాడని పూజ భావించింది. పక్కా ప్లాన్తో ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది. పిల్లలు చూస్తుండగానే భర్తను గొంతు కోసి హతమార్చింది. నిందితులు పూజ, ఇమ్రాన్ను పోలీసులు అరెస్ట్ చేసారు. కోర్టులో ప్రవేశపెట్టారు.