ఆత్మహత్య చేసుకుంటానని వెళ్లి.. పెళ్లి చేసుకుని ఇంటికి

Crime Published On : Wednesday, January 29, 2025 09:00 AM

తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ వెళ్లిపోయిన ఓ యువకుడు పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చిన ఘటన విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ లో చోటుచేసుకుంది. అజిత్ సింగ్ నగర్ ఎక్సెల్ ప్లాంట్ వద్ద ఉండే ఓ యువకుడు ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఓ యువతిని ప్రేమించాడు. ఇటీవల వారిద్దరూ ఇంట్లో నుంచి పారిపోగా నున్న పోలీసులు కేసు నమోదు చేశారు. యువతిని తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు.

ఈ నేపథ్యంలో పెళ్లికి ఒప్పుకోకపోవడంతో మనస్తాపానికి గురైన ఆ యువకుడు తాను చనిపోతున్నానంటూ లేఖ రాసి ఆదివారం వెళ్లిపోయాడు. దీనిపై అజిత్ సింగ్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ యువకుడు తాను ప్రేమించిన యువతిని పెళ్లిచేసుకొని మంగళవారం ప్రత్యక్షమయ్యాడు. రక్షణ కోసం పోలీసులను ఆశ్రయించారు. ఇద్దరూ మేజర్లు కావడంతో ఇరుపక్షాల తల్లిదండ్రులను పిలిపించారు.