భర్తను నరికి చంపి.. ప్రియుడితో హోలీ
ప్రియుడి మోజులో భర్తను హతమార్చిన ఘటనలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. భర్త సౌరభ్ రాజ్ పుత్ ను చంపిన 11 రోజుల తర్వాత భార్య ముస్కాన్ రస్తోగి ప్రియుడు సాహిల్ తో కలిసి ఆనందంగా హోలీ జరుపుకొంది.
ఇద్దరూ రంగులు పూసుకొని వీడియో తీసుకున్నారు. తాజాగా ఆ వీడియో వైరల్ అవుతోంది. దీంతో ఆమెపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ముస్కాన్, సాహిల్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.