విద్యార్థినిపై అత్యాచారం..ఆపై అబార్షన్..
ఏపీలోని అన్నమయ్య జిల్లా రాయచోటిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పదో తరగతి చదువుతున్న బాలికపై ల్యాబ్ టెక్నీషియన్ విజయ్ కుమార్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా ఏడు నెలల గర్భంతో ఉన్న బాలికకు మూడో కంటికి తెలియకుండా అబార్షన్ చేయించాడు. ఓ ప్రవేటు ఆస్పత్రిలోని ఓ నర్సు సాయంతో అబార్షన్ చేయించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు విజయ్ కుమార్‌ని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.