కాంగ్రెస్ నాయకురాలు హత్య.. పార్టీ వారే హత్య చేశారంటూ తల్లి ఆరోపణ
హరియాణాలో యువ కాంగ్రెస్ నాయకురాలు హిమానీ నర్వల్ దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్యపై హిమానీ తల్లి సవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఆమె ఎదుగుదలను తట్టుకోలేక పార్టీలోని వ్యక్తులే తన కూతురిని హతమార్చి ఉండొచ్చని ఆరోపించారు.
హిమానీ కాంగ్రెస్ కోసం పదేళ్లుగా ఎన్నో త్యాగాలు చేశారని అన్నారు. పార్టీలోని గొడవలు, వాగ్వాదాల గురించి కూతురు తనతో చెప్పేదని, తప్పొప్పుల విషయంలో ఆమె కాంప్రమైజ్ అయ్యేది కాదని తెలిపారు. అయితే హిమానీ నర్వల్ మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.