చంపినట్లు ఒప్పుకున్నాడు.. నిరూపించే సాక్ష్యం లేదు.. అయోమయంలో పోలీసులు

Crime Published On : Thursday, January 23, 2025 07:37 PM

హైదరాబాదులో భార్యను భర్త ముక్కలుగా నరికి చంపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుడు గురుమూర్తి నేరం ఒప్పుకున్నాడు. అయితే తన భార్యను తానే చంపినట్లు నిందితుడు పోలీసుల ముందు అంగీకరించాడు. దర్యాప్తులో భాగంగా పోలీసులు నిందితుడి ఇంటి ఎదురుగా, పక్కన ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. అందులో పలుమార్లు గురుమూర్తి కొన్ని కవర్లతో బయటకు వెళ్లి రావడాన్ని గుర్తించారు. దీంతో గురుమూర్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. తానే హత్య చేసినట్లు చివరికి ఒప్పుకున్నట్టు సమాచారం. 

నిందితుడు గురుమూర్తి నేరం ఒప్పుకున్నా నేరాన్ని నిరూపించలేక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. గురుమూర్తే నేరస్తుడు అనడానికి పోలీసులకు ఒక్క ఆధారం కూడా లభించలేదు. పోలీసులు ముందు వెంకటమాధవి చనిపోయిందని నిరూపించాల్సి ఉంటుంది. అలా చేసినా ఆమెను భర్తే హత్య చేశాడని నిరూపించాలి. ఆమె ఎముకలను పొడి చేసి చెరువులో కలపడం, మాంసాన్ని పీస్లు చేసి డ్రైనేజీల్లో వేయడంతో ఇప్పుడు వాటి ఆనవాళ్లు కూడా లేవు. ఇంట్లోనే ఆమె శరీరానికి సంబంధించిన మాంసపు ముద్ద ఏదైనా దొరికితే దాని ఆధారంగా డీఎన్ఏ పరీక్ష చేసి చనిపోయింది వెంకటమాధవే అని తేల్చే అవకాశం ఉంటుంది. కానీ, ఇదంతా పోలీసులకు పెద్ద సవాలుగా మారింది.

మేఘ శుక్లా హాట్ ఫోటోలు.. నిజంగానే హీరోయిన్ మెటీరియల్ భయ్యా

See Full Gallery Here...