నలుగురు పిల్లల గొంతు కోసి తండ్రి ఆత్మహత్య
నలుగురు పిల్లల గొంతు కోసి తండ్రి ఆత్మహత్య చేసుకున్న దారుణ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని షాజహాన్ పూర్ లో చోటు చేసుకుంది. రాజీవ్ కతేరియా, కంతీదేవి భార్యాభర్తలు. వారికి నలుగురు పిల్లలు. రాజీవ్ కతేరియా భార్యతో గొడవపడి కోపంలో తన నలుగురు పిల్లలు స్మృతి, కీర్తి, ప్రగతి, రిషభ్ గొంతు కోసి దారుణంగా హతమార్చాడు.
అనంతరం తానూ భార్య చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పిల్లలంతా 13 నుంచి 5 ఏళ్ల లోపు వారే. రాజీవ్ మానసిక పరిస్థితి సరిగా లేదని పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.