గదిలో ఏకాంతంగా అమ్మాయి, అబ్బాయి.. అంతలోనే ఊహించని ట్విస్ట్..

Crime Published On : Thursday, January 30, 2025 09:30 AM

బాలుడు, బాలిక గదిలో ఏకాంతంగా ఉండగా చివరికి ఘోరం జరిగిన ఘటన తెలంగాణలోని హన్మకొండలో చోటు చేసుకుంది. హన్మకొండ నగరంలోని శివారు ప్రాంతంలో 17 ఏళ్ల బాలిక ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోంది. ఈమె వరంగల్‌లో నివాసం ఉంటున్న ఓ బాలుడి(17)తో ప్రేమలో పడింది. ఇద్దరికీ 18 ఏళ్లు కూడా నిండకున్నా ప్రేమలో మునిగి తేలుతున్నారు. ఈ నెల 28న బాలిక ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఇదే సమయం అనుకొని తన లవర్ కు కాల్ చేసింది. ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నా వచ్చేయ్ అని చెప్పింది. ఇంకేముంది గురుడు ఆగకుండా క్షణాల్లో ఆమె ఇంటికి చేరుకున్నాడు. ఇద్దరూ గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకుంటున్న సమయంలో అమ్మాయి నాన్న వచ్చేశాడు.ఆ జంటకు గుండెలు జారిపోయాయి.

తన కూతురిని ఆ స్థితిలో చూసి తండ్రికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పక్కనే ఉన్న కత్తితో బాలుడి గొంతు కోసేశాడు. ఇది చూసిన ఆ బాలిక కేకలు వేసింది. తీవ్ర రక్తం స్రావంతో బాలుడు ఇంట్లో నుంచి భయటకు వచ్చి ప్రాణ భయంతో పరుగులు పెట్టాడు. అయినా వదలకుండా బాలుడి వెంటపడ్డాడు. అక్కడే ఉన్న ఆ బాలికకు భయం వేసింది. తనను తండ్రి ఆ పరిస్థితిలో చూడటంతో అవమానంగా భావించి గదిలోకి వెళ్ళి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బాలిక తండ్రి వెంటనే స్థానికుల సహాయంతో తలుపులను బద్దలు కొట్టి ఇంట్లోకి ప్రవేశించాడు. అప్పటికే ఆ బాలిక చనిపోయింది. అక్కడ నుంచి పారిపోయిన ఆ బాలుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.