నాన్నే అమ్మను చంపేశాడు.. 4 ఏళ్ల చిన్నారి డ్రాయింగ్
ఉత్తర ప్రదేశ్ లోని ఝాన్సీలో ఓ వివాహితను భర్త హత్య చేసి మృతిగా చిత్రీకరించాలని చూశాడు. చివరికి దొరికిపోయాడు. సోనాలి బుధోలియా, సందీప్ బుధోలియా భార్య భర్తలు ఝాన్సీలో నివసిస్తున్నారు. వారికి నాలుగేళ్ల కుమార్తె దర్శిత ఉంది. సోనాలి సోమవారం చనిపోయింది. ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు ఆమె అత్తమామలు తెలిపారు.
విచారణలో చిన్నారి దర్శిత వేసిన డ్రాయింగ్ ఈ కేసును మరో మలుపు తిప్పింది. తన తల్లిని తండ్రి చంపి, ఉరి వేసినట్లు ఆమె డ్రాయింగ్ వేసింది. దీంతో నిందితుడు సందీప్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.