భార్య టార్చర్ భరించలేక రైలు కింద దూకిన భర్త
భార్య వేధింపులు తాళలేక మరో భర్త తనువు బలవన్మరణానికి పాల్పడ్డాడు. వేగంగా వస్తున్న రైలు ముందు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఒడిశాలోని ఖోర్దా జిల్లాలో జరిగింది. రామచంద్ర బర్జెనాకు రెండేళ్ల కింద రూపాలి అనే మహిళతో వివాహం జరిగింది. వారికి ఓ కుమార్తె కూడా ఉంది. పెళ్లి నాటి నుంచి భార్య మానసికంగా వేధిస్తోందంటూ ఓ వీడియో రికార్డ్ చేసి అతను ఆత్మహత్య చేసుకున్నాడు. రామచంద్ర తల్లి ఫిర్యాదుతో రూపాలిని పోలీసులు అరెస్ట్ చేశారు.