రైలు కింద ఇంటర్ అమ్మాయి.. తల మొండెం వేరు
రైల్వే ట్రాక్ పై ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన సికింద్రాబాద్ జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ సమీపంలో మంగళవారం చేసుకుంది. సిద్ధిపేటకు చెందిన భార్గవి ఓయూ ఆంధ్ర మహిళా సభ కాలేజీలో ఇంటర్ చదువుతోంది. రైల్వేట్రాక్ పై ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. తల, మొండెం వేరు అయ్యాయి. ఈ హృదయ విదారక దృశ్యాన్ని చూసి ఆమె స్నేహితులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.