పేర్లు రాసి మరీ సూసైడ్ చేసుకున్న జన సైనికుడు
తన పరువు తీశారని, అందుకే చనిపోతున్నానని, పేర్లు రాసి మరీ జనసైనికుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన గుడివాడలో చోటు చేసుకుంది. ఆటోడ్రైవర్ రావి సత్తిబాబు విస్తార్ ఫైనాన్స్ కంపెనీ వద్ద రూ.7.80 లక్షలు లోన్ తీసుకున్నారు. క్రమం తప్పకుండా EMI చెల్లించేవారు.
భార్య అనారోగ్యం కారణంగా ఈ నెల కంతు కట్టలేకపోయారు. ఆ విషయం చెప్పినా వినిపించుకోని కంపెనీ ప్రతినిధులు ఇంటా, బయటా ఆయన పరువు తీశారు. అవమానం భరించలేకపోయిన ఆయన, తన చావుకు విస్తార్ ఫైనాన్స్ సంస్థే కారణమని ఫేస్బుక్లో పోస్ట్ పెట్టి ఆత్మహత్యకు పాల్పడ్డారు.