నిండు ప్రాణాన్ని బలిగొన్న ట్రాఫిక్ పోలీసులు
నిండు ప్రాణాన్ని ట్రాఫిక్ పోలీసులు బలిగొన్న దారుణ ఘటన హైదరాబాద్ బాలానగర్ లో చోటు చేసుకుంది. సరైన ఏర్పాట్లు లేకుండా ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన వాహన తనిఖీలు ఓ వాహనదారుడి ప్రాణాన్ని బలిగొన్నాయి. ద్విచక్రవాహనంపై వెళ్తున్న వాహనదారుడిని ఆపేందుకు కానిస్టేబుల్ అత్యుత్సాహం ప్రదర్శించడంతో ఆ వ్యక్తి ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. వెనకే వస్తున్న బస్సు అతనిపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. తోటి వాహనదారులు రోడ్డుపై ఆందోళనకు దిగగా వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చింది.