కదులుతున్న రైలులో నిండు గర్భిణిపై అత్యాచారం

Crime Published On : Friday, February 7, 2025 10:48 PM

తమిళనాడులోని కేవీ కుప్పం స్టేషన్ సమీపంలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ కామాంధుడు గర్భిణిపై లైంగిక వేధింపులకు పాల్పడి కదులుతున్న ట్రైన్ నుంచి తోశేశాడు. కోయంబత్తూరు, తిరుపతి ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ ట్రైన్లో ఈ ఘటన జరిగింది. బాత్రూమ్కి వెళ్లిన సమయంలో గర్భిణిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. మహిళ అరుస్తున్నా నిందితుడు హేమరాజ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.

మహిళ కేకలేస్తుండటంతో కదులుతున్న రైలు నుంచి తోసివేసాడు. గర్భిణి కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. మహిళను తోటి ప్రయాణికులు కాపాడారు. ఆ మహిళను చిత్తూరు వాసిగా గుర్తించారు. కాట్పాడి రైల్వే పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై గతంలో పలు కేసులు నమోదయ్యాయి.