బట్టతల ఉందని పెళ్లి రద్దు.. రైలు కింద పడి డాక్టర్ సూసైడ్
బట్టతల కారణంగా పెళ్లి రద్దు కావడంతో మనస్తాపం చెంది ఓ ఎంబీబీఎస్ వైద్యుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. పురోహిత్ కిశోర్ (34) అల్వాల్ బస్తీ దవాఖానాలో వైద్యుడిగా పని చేస్తున్నారు. ఇటీవల అతనికి ఓ యువతితో నిశ్చితార్థం అయింది.
ఆ తర్వాత కిశోర్ కు బట్టతల ఉండటం, ఇతరత్రా కారణాలతో పెళ్లి రద్దైంది. వయసు మీరినా వివాహం కావట్లేదని మనస్తాపం చెంది బొల్లారం రైల్వేస్టేషన్ సమీపంలో రైలు కింద పడి అతడు ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.