కూతురిని ప్రేమించిన పెళ్ళైన వ్యక్తి.. ముక్కలుగా నరికిన తండ్రి

Crime Published On : Sunday, February 16, 2025 03:22 PM

పెళ్ళైన ఓ వ్యక్తి తన కూతురిని ప్రేమించాడని తండ్రి ముక్కలుగా నరికి చంపాడు. ఈ దారుణ ఘటన తెలంగాణలోని సంగారెడ్డిలో చోటు చేసుకుంది. తన కుమార్తెను ప్రేమించాడని దశరథ్ అనే వ్యక్తిని తండ్రి గోపాల్ హత్య చేసాడు. ఈ ఘటనలో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి.

కూతురితో తండ్రి ఫోన్ చేయించి దశరథ్ ను మెగ్యా తండాకు రప్పించాడు. పెళ్లయ్యాక నా కూతురిని ఎందుకు ప్రేమిస్తున్నావ్.. వదిలేయ్ అంటూ వార్నింగ్ ఇచ్చాడు. అనంతరం బండ రాయితో కొట్టి చంపి మృతదేహాన్ని తగలబెట్టాడు. పూర్తిగా కాలలేదని ముక్కలుగా నరికి వేర్వేరు ప్రాంతాల్లో విసిరేసినట్లు సమాచారం.