గుడికి వచ్చిన మహిళపై 9 మంది గ్యాంగ్ రేప్
తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఆలయానికి వచ్చిన వివాహితపై గ్యాంగ్‌రేప్ జరిగింది. మొక్కులు చెల్లించుకునేందుకు గుడికి వచ్చిన వివాహితపై 9 మంది యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఊర్కొండపేట ఆంజనేయస్వామి ఆలయ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
పోలీసులు ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నేరచరిత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు. బాధితురాలి స్టేట్మెంట్ ఇప్పటికే పోలీసులు రికార్డ్ చేశారు.