నాకు బెయిల్ వద్దు, న్యాయవాదులు వద్దు : గురుమూర్తి సంచలన వ్యాఖ్యలు

Crime Published On : Wednesday, January 29, 2025 09:56 PM

హైదారాబాద్ మీర్ పేట్ మాధవి హత్య కేసులో నిందితుడు గురుమూర్తికి రంగారెడ్డి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. దీంతో నిందితుడు గురుమూర్తిని చర్లపల్లి జైలుకు తరలించారు పోలీసులు. కోర్టులో జడ్జి ఎదుట 'నాకు బెయిల్ వద్దు. న్యాయవాదులు వద్దు' అని గురుమూర్తి చెప్పినట్లు తెలుస్తోంది. ఈ మర్డర్ కేసులో పోలీసులు కీలక విషయాలు బయటపెట్టారు. జనవరి 16వ తేదీ ఉదయం 8 గంటలకు నిద్రలేచిన వెంటనే మాధవి గురుమూర్తిల మధ్య గొడవ స్టార్ట్ అయిందని చెప్పారు. గొడవ కావడంతో మాధవిని చంపాలని గురుమూర్తి అనుకున్నాడని, అందుకోసమే ఆమెని కొట్టినట్లు నిర్ధారించారు. మొదట ఆమె చెంపపై కొట్టడంతో గోడకు తాకి కుప్పకూలిపోయిందని, వెంటనే ఆమెస్పృహ కోల్పోయిన ఆమెను చంపాలనే ఉద్దేశంతో ఆమె గొంతు పిసికేసినట్లు చెప్పారు. మాధవి చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత మాధవి శరీరంపై ఉన్న బట్టలను తొలగించి డెడ్ బాడీని బాత్రూంలోకి తీసుకెళ్లి ముక్కలు చేసినట్లు వెల్లడించారు.

ఆమె చనిపోయిన తర్వాత కిచెన్లో నుంచి కత్తి తీసుకొని వచ్చాడు. ఫస్ట్ మాధవి భుజాలను కట్ చేశాడు. డెడ్ బాడీ నుండి చేతులను వేరు చేశాడు. ఆ తర్వాత డెడ్ బాడీ నుండి కాళ్లను కూడా వేరు చేశాడు. కాళ్లు, చేతులను ముక్కలు ముక్కలు చేశాడు. ముక్కలుగా చేసిన కాళ్లు చేతుల భాగాలను బకెట్లో వేశాడు. బకెట్లో వాటర్ హీటర్ పెట్టాడు. బాగా శరీర భాగాలు ఉడికిన తర్వాత బకెట్లోంచి ఆ భాగాలను తీసి స్టవ్ పై కాల్చివేశాడు. కాలిన ఎముకలను రోటిలో దంచి పౌడర్ చేశాడు. ఆ పౌడర్ ను బాత్రూంలో వేసి అనేక సార్లు ఫ్లెష్ చేశాడు. మరికొన్ని చిన్నచిన్న ఎముకలను డస్ట్ బిన్ లో వేసి పడేసినట్లు తెలిపారు.