ఏపీలో ఘోరం.. 3 రోజులుగా మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్
మైనర్ బాలికను మూడు రోజుల పాటు నిర్బంధించి గ్యాంగ్ రేప్ కు పాల్పడిన అమానుష ఘటన కృష్ణా జిల్లా వీరపనేనిగూడెంలో వెలుగులోకి వచ్చింది. ఈనెల 9న రాత్రి స్నేహితురాలి ఇంటి నుంచి బయటకు వచ్చిన బాలికను యువకులు కిడ్నాప్ చేశారు. మూడు రోజులపాటు నిర్బంధించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఫిర్యాదు నమోదు చేసి సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసును ఛేదించారు. ఈ కేసులో 8 మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ఒకరు పదో తరగతి పరీక్షలు రాస్తున్నట్లు గుర్తించారు.