రెండు రోజులు నిద్ర లేకుండా.. మాధవి మృతదేహంతో అదే పనిలో

Crime Published On : Saturday, January 25, 2025 12:59 PM

హైదారాబాద్ కుక్కర్ మర్డర్ కేసులో మరిన్ని షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. మరో మహిళతో ఉన్న వివాహేతర సంబంధమే ఈ హత్యకు దారి తీసినట్లు విచారణలో భాగంగా పోలీసులు గుర్తించారు. పక్కా ప్లాన్‌ ప్రకారం హత్య చేసిన గురుమూర్తి, ఓ వెబ్‌ సిరీస్‌ తరహాలో మృతదేహాన్ని మాయం చేసి తప్పించుకోవాలని చూసినట్టు పోలీసులు నిర్ధారించారు. సంక్రాంతి సందర్భంగా గురుమూర్తి తన ఇద్దరు పిల్లల్ని నగరంలోనే ఉండే తన సోదరి ఇంటి దగ్గర దింపాడు. 13, 14 తేదీల్లో మాధవితో కలిసి ఉదయం సోదరి ఇంటికెళ్లి సాయంత్రానికి తిరిగొచ్చేవారు. 15వ తేదీన ఉదయం గురుమూర్తికి భార్యకు గొడవ మొదలైంది. మరో మహిళతో సంబంధం, ఇందుకు సంబంధించి కొన్ని ఫొటోలు భార్య చూసింది. అప్పటికే భార్యను హతమార్చాలని కసితో ఉన్న గురుమూర్తి అనుకున్నంత పని చేశాడు. భార్యను తలమీద కొట్టడంతో ఆమె కిందపడిపోయింది. ఆరు నెలల క్రితం ఓటీటీలో చూసిన వెబ్‌సిరీస్‌లోని పాత్రల తరహాలోనే మృతదేహాన్ని మాయం చేయాలనుకున్నాడు. ఇందులో భాగంగా మృతదేహాన్ని టాయిలెట్‌లోకి తీసుకెళ్లి ముక్కలుగా నరికాడు.

ఆ తర్వాత బకెట్‌ నీళ్లను హీటర్‌తో వేడి చేసి ముక్కల్ని వేశాడు. ముక్కలు మొత్తగా మారాక మాంసాన్ని ఎముకల నుంచి విడదీసి మరో బకెట్లో వేసి రోకలితో దంచి ముద్దగా చేశాడు. ఎముకల్ని ముక్కలుగా చేసి అంతా సంచుల్లో నింపి సమీపంలోని చెరువులో వేశాడు. హత్య తర్వాత దాదాపు రెండ్రోజులు నిద్రలేకుండా ఇదంతా చేసినట్లు నిందితుడు పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. మృతదేహాన్ని మాయం చేసిన తర్వాత గదిని నీళ్లతో శుభ్రం చేశాడు. 17వ తేదీ సాయంత్రం భార్య కనిపించడం లేదని వెంకట మాధవి తల్లిదండ్రులకు ఫోన్‌లో చెప్పాడు. చిన్న గొడవతో ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు ఫిర్యాదు చేయించాడు.

బికినీల్లో అందమైన ఇండియన్ ఆంటీలు - ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...