లవర్లకు ముద్దులు, భార్యకు పిడిగుద్దులు.. డీఐజీ కిరణ్ ఆగడాలు
రిజిస్ట్రేషన్ శాఖలో నెల్లూరు డీఐజీ కిరణ్ కుమార్ వికృత చేష్టలు బయటపడ్డాయి పలువురు మహిళలతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఆయన వేరే మహిళలతో ఉన్న ఫోటోలు భార్య అనసూయరాణికి పంపి వేధింపులకు గురిచేస్తున్నాడు. భార్యాబిడ్డలను రోజూ చావ బాదుతూ చిత్రహింసలు పెడుతున్నాడు. ఇందులో భాగంగానే గత రాత్రి సైతం భార్యను చితకబాదాడు. భర్త దాడిలో స్పృహ కోల్పోయిన అనసూయరాణిని స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కిరణ్ భార్యకు చికిత్స అందించారు. అనంతరం అనసూయరాణి తన భర్తపై గుంటూరు అరండల్పేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
అనసూయరాణిని కిరణ్ కుమార్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అనసూయరాణి ప్రస్తుతం ఎల్ఐసీలో అసిస్టెంట్ మేనేజర్గా పని చేస్తున్నారు. పోస్టల్ కాలనీలో నివాసం ఉంటున్నారు. దంపతుల మధ్య విభేదాలు రావడంతో గత కొంతకాలంగా వేర్వేరుగా ఉంటున్నారు. తన మీద ఫిర్యాదు చేసిన భార్యకు అండగా వచ్చిన బంధువులపై అట్రాసిటీ కేసు పెడతానని కిరణ్ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. అనసూయరాణి మీడియాతో మాట్లాడుతూ తనకు పిల్లలు పుట్టకపోవటంతో ఓ పాపను దత్తత తీసుకున్నామని, 2012లో సరోగసీ ద్వారా ఓ బాబు పుట్టినట్టుగా తెలిపారు. అయితే కొన్నేళ్లుగా వేరే మహిళలతో తన భర్త అక్రమ సంబంధాలు పెట్టుకుని తనను ఇబ్బంది పెడుతున్నాడంటూ అవేదన వ్యక్తం చేశారు. తన భర్త పెట్టే టార్చర్ తాళలేక పది నెలల నుంచి వేర్వేరుగా ఉంటున్నట్లుగా తెలిపారు. ప్రస్తుతం పాప విదేశాల్లో చదువుకుంటుండగా, బాబు తనతోనే ఉంటున్నాడని చెప్పారు. రెండు రోజుల కిందట తన బంధువుల ఇంటికి వెళ్తుంటే అడ్డుకుని బాబును, తనను తన భర్త కొట్టాడని అనసూయరాణి తెలిపారు.