శోభనం కోసం గదిలోకి వెళ్ళారు.. ఉదయాన్నే శవాలై తేలారు..

Crime Published On : Monday, March 10, 2025 09:14 PM

శోభనం కోసం గదిలోకి వెళ్ళిన నవ జంట ఉదయాన్నే శవాలై తేలారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో వెలుగు చూసింది. శ్రీరామ్ నగర్ లో కుటుంబ సభ్యుల సమక్షంలో ఓ జంట సంతోషంగా పెళ్లి చేసుకుంది. వారికి పెద్దలు శోభనం ఏర్పాటు చేసి గదిలోకి పంపించారు.

అయితే తెల్లారి లేచి చూసేసరికి వధువు శివాని మంచంపై పడిపోయి ఉండగా వరుడు ప్రదీప్ ఫ్యానుకు వేలాడుతూ కనిపించాడు. వధువును చంపి అతను ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కాళ్ళ పారాణి ఆరకముందే నవ వధూవరులు మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

బికినీల్లో అందమైన ఇండియన్ ఆంటీలు - ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...