హోలీ సాకుతో విద్యార్థినులతో ప్రిన్సిపల్ అసభ్యకర ప్రవర్తన
హోలీ సాకుతో విద్యార్థినులతో ప్రిన్సిపల్ అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన సత్యసాయి జిల్లా కదిరిలో చోటు చేసుకుంది. కదిరిలోని అమృతవల్లి డిగ్రీ కాలేజిలోని ఆ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. అమృతవల్లి మహిళా డిగ్రీ కాలేజిలో శుక్రవారం హోలీ వేడుకలు నిర్వహించారు.
కాలేజి ప్రిన్సిపాల్ పి.వెంకట పతి కొంత మంది విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించారు. భౌతికంగా వారి శరీరాన్ని తాకుతూ తీసుకెళ్లి బురదలో ముంచారు. ఆ విషయములో సంఘటనపై విచారించి మహిళా కానిస్టేబుల్ గౌసియా ఇచ్చిన పిర్యాదు మేరకు Section 75 BNS కింద కదిరి టౌన్ పోలీస్ స్టేషన్ లో ప్రిన్సిపల్ పై కేసు నమోదు చేశారు.